చేతన్ చీను 'దేవదాసి' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను, సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి' త్వరలో శ్రీ లక్ష్మీ నరసింహ సినీ చిత్ర బ్యానర్ లో ప్రారంభం కానుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్'స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ మాటలు దర్శకత్వం మధురావు మాదాసు.
ప్రస్తుతం ఎందరో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెండి తెరపై తమ అద్రృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా తోట. బాలకృష్ణ పనిచేస్తున్నారు. ఇతను గతంలో బాహుబలి 1 కు ఆపరేటివ్ కెమెరా మెన్ గా పని చేసి ఆ తరువాత ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీకి డీ.ఓ.పి గా పని చేసిన అనుభవం ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్ గా ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గారు. సంగీతం 'యాజమాన్య', కొరియోగ్రఫీ శివశంకర్ మాస్టర్ మరియు విజయ్. రచనా సహకారం ఎ. వి. యస్. ఆదినారాయణ...
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ మొన్న వినాయక చవితి పండుగ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం జరిగింది. ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొట్టమొదటి సారిగా ఒక మోషన్ పోస్టర్ ను ప్రేక్షకులు దర్శకుడిని హీరో ని మెచ్చుకుంటూ రివ్యూస్ వ్రాయడం తెలుగు లో బహుశా ఇదే మొదటిసారి అనుకుంట. అయితే మోషన్ పోస్టర్ చివరిలో గజ్జెలు పట్టుకుని కూర్చున్న దేవదాసి పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అనేది చిత్ర యూనిట్ బహిర్గతం చేయకపోవడంతో ప్రేక్షకులలో ఆమె ఎవరు అని ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments