అర్జున్‌రెడ్డికి చెర్రీ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ్ చేసిన ట్వీట్ అందరికీ ఆసక్తికరంగా మారింది. సినిమా విడుదలకు ముందు నుంచే సంచలనం రేపుతున్న అర్జున్ రెడ్డి గురించి రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
బ్లడీ బోల్డ్ అని, రా అని, రియలిస్టిక్ అని చెర్రీ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రామ్‌చరణ్ అంతటితో ఆగకుండా సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణన్‌కు కూడా హాట్సాఫ్ అని హ్యాష్ ట్యాగ్ జతచేశారు. విజయ్ దేవరకొండ మూడు గెటప్పుల్లో కనిపించిన ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా మంది ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
కాస్త ఆలస్యంగానైనా తన మనసులోని మాటను వెల్లడించారు రామ్‌చరణ్. సినిమా బావుండాలే గానీ, ప్రోత్సహించడానికి పరిశ్రమలోని వారు ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి అర్థమైందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అర్జున్ రెడ్డి టీమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com