రెండ్రోజుల్లో ఐపీఎల్ ... ధోనీ సంచలనం , చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న మహీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్ తగిలింది. జట్టును పలు మార్లు విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ విషయాన్ని చెన్నై యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ధోని నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిపాడు. అటు 2012 నుంచి జడేజా.. చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌గా ధోని జట్టును అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. చెన్నై తరఫున 12 సీజన్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. 196 మ్యాచుల్లో 117 విజయాలు సాధించాడు. 59.69 శాతం విజయాలతో సీఎస్కేను అగ్రస్థానంలో నిలిపాడు.
2012, 2013, 2015 సీజన్లలో చెన్నై జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2016, 2017 సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న సీఎస్కే.. 2018లో రీ ఎంట్రీ ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. మూడోసారి విజేతగా నిలిచింది. 2019లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన చెన్నై.. 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మరోసారి జట్టును విజేతగా నిలిపాడు ధోనీ. ఈ సారి కూడా కప్ గెలుచుకొస్తాడని భావిస్తున్న వేళ.. అందరికీ షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com