రెండ్రోజుల్లో ఐపీఎల్ ... ధోనీ సంచలనం , చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న మహీ

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌‌కి షాక్ తగిలింది. జట్టును పలు మార్లు విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ విషయాన్ని చెన్నై యాజమాన్యం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును ధోని నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిపాడు. అటు 2012 నుంచి జడేజా.. చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌గా ధోని జట్టును అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. చెన్నై తరఫున 12 సీజన్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. 196 మ్యాచుల్లో 117 విజయాలు సాధించాడు. 59.69 శాతం విజయాలతో సీఎస్కేను అగ్రస్థానంలో నిలిపాడు.

2012, 2013, 2015 సీజన్లలో చెన్నై జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2016, 2017 సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న సీఎస్కే.. 2018లో రీ ఎంట్రీ ఇచ్చింది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. మూడోసారి విజేతగా నిలిచింది. 2019లో మరోసారి రన్నరప్‌గా నిలిచిన చెన్నై.. 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మరోసారి జట్టును విజేతగా నిలిపాడు ధోనీ. ఈ సారి కూడా కప్ గెలుచుకొస్తాడని భావిస్తున్న వేళ.. అందరికీ షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

More News

పిల్లి వల్ల అక్షరాలా 100 కోట్ల నష్టం.. లబోదిబోమంటోన్న జనం, ఎక్కడో కాదు ఇండియాలోనే

మియావ్ మియావ్ అనుకుంటూ ఎలుకలు పట్టుకోవడానికి ఇళ్లలోకి దూరి.. సామాన్లన్నీ చిందర వందర చేసే పిల్లి అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.

'గని'లో తమన్నా స్పెషల్ సాంగ్ ... వీడియో వెర్షన్ వచ్చిందోచ్, పిచ్చెక్కిస్కోన్న మిల్కీబ్యూటీ

చేతి నిండా సినిమాలతో, అగ్ర కథానాయికగా బిజీగా వున్న సమయంలోనే ‘ఐటెం సాంగ్’ చేసి సంచలనం సృష్టించారు మిల్కీబ్యూటీ తమన్నా.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా.. బీమ్లా నాయక్ సంచలనం !!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "పవర్" తుఫాను మొదలైంది. ఆ "స్టార్" వెలుగుల సంచలనం ఆరంభమైంది. దాని పేరు "బీమ్లా నాయక్". ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో...

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. యూనిట్‌కి ఎంత, ఎప్పటి నుంచి అమలంటే..?

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు టీఎస్ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డీవీవీ దానయ్య కుమారుడు.. ఆకట్టుకుంటోన్న ‘ఫస్ట్‌ స్ట్రైక్‌’

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి.