బిగిల్ సినిమా చూపించి చికిత్స.. డాక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి
Send us your feedback to audioarticles@vaarta.com
పేషంట్లని డాక్టర్లు ప్రేమించాలని, ఫ్రెండ్లీగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో చూశాం. చెన్నైలో ఓ డాక్టర్ అక్షరాలా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. పదేళ్ల పిల్లాడికి విజయవతంగా చికిత్స పూర్తి చేశాడు. సాధారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రి అంటే భయంతో వణికిపోతుంటారు.
ఇదీ చదవండి: బిజీగా పుష్పరాజ్.. రంగంలోకి రంగమ్మత్త!
ఇంజక్షన్ వేసే సమయంలో అయితే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే చిన్న పిల్లల విషయంలో వైద్యులు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంటారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై మైలాపూర్ కు చెందిన శశి అనే పదేళ్ల కుర్రాడు తన మేనమామతో కలసి సరదాగా బైక్ రైడ్ కు వెళ్ళాడు.
ప్రమాదవశాత్తూ బైక్ నుంచి శశి పడిపోయాడు. దీనితో అతడి తలకు పెద్ద గాయమే అయ్యింది. దీనితో శశిని వెంటనే రాయ్ పేట్ లోని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రంగా రక్త స్రావం అవుతుండడంతో వెంటనే కుట్లు వేయాలని వైద్యులు సూచించారు.
కుట్లు వేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు డాక్టర్. కానీ శశి అందుకు ససేమిరా అంగీకరించలేదు. ఇంజక్షన్ వేయొద్దు అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. దీనితో వైద్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీనితో మరో వైద్యుడు శశి వద్దకు వెళ్లి మాటామాటా కలిపాడు. తనకు ఏ హీరో అంటే ఇష్టమో అడిగి తెలుసుకున్నాడు. శశికి ఇలయథలపతి విజయ్ అంటే ఇష్టం అని డాక్టర్ గ్రహించాడు.
దీనితో వెంటనే ఫోన్ లో బిగిల్ చిత్రాన్ని ప్లే చేసి శశికి ఇచ్చాడు. శశి సినిమాలో లీనమైపోవడంతో వైద్యులు తమ పని సులువుగా పూర్తిచేసేశారు. శశికి విజయవంతంగా చికిత్స పూర్తయింది. ఈ న్యూస్ గురించి తెలుసుకున్న వైద్యులు ఆ డాక్టర్ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ అభినందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout