ఫిబ్రవరి 19న 'చెక్' రిలీజ్

  • IndiaGlitz, [Friday,January 22 2021]

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న 'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్చేస్తున్నామని నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్తఅనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలాచేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులోఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఇందులోకథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలాఆసక్తికరంగా ఉంటాయి అని తెలిపారు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

More News

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

దుబాయ్‌లో సర్కారువారి పాట లాంగ్ షెడ్యూల్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమా స‌ర్కారు వారిపాట‌ కోసం దుబాయ్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

నాగ‌శౌర్య‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన 'లక్ష్య' టీజ‌ర్‌

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో

పిటిషన్ మొత్తం తప్పుల తడక.. వైసీపీకి సుప్రీంలో ఊహించని షాక్

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిన్నట్టుంది: పవన్

అదృష్టం అందలం ఎక్కిస్తే...బుద్ధి బురదలోకి దిగిందన్నట్టు వైసీపీ వైఖరి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.