'చీమ - ప్రేమ మధ్యలో భామ!' ఆడియో లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! అంత వరకు బాగానే ఉంది – మరి అది సాధ్యమా ? ఏం జరుగుతుంది ? అసలు ఆ భావన ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా. మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ రోజు ఆడియోని ఫిలింఛాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో...
దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” చీమ – ప్రేమ మధ్యలో భామ!” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మా సినిమాకి చీమే కథ. జగమంతా రామమయం మా సినిమా అంతా చీమ మయం. ఈ సినిమాలోని పాటలు అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అన్నారు.
నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం లో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా చూడవచ్చు. దర్శకుడు కొత్తవారైనా సినిమాని ఎలా చెప్పారో అలానే తెరకెక్కించారు. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.
సంగీత దర్శకుడు, సింగర్ రవివర్మ మాట్లాడుతూ ” మా గురువుగారు ఎస్.పి. బాలుగారు ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను సింగర్‌ని అయ్యాను. ఈ సినిమా చేస్తుండగా నాకు మా దర్శకుడు సంగీత నిరంకుశ అని బిరుదును కూడా ఇచ్చారు. హైమత్ కూడా ఒక పాటను రాశారు. చాలా బాగా రాశారు. మిగతా లిరిసిస్ట్లందరూ కూడా చాలా బాగా రాశారు. చిన్న సినిమా అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సింగర్ గీతామాధురి మాట్లాడుతూ... ఈ సినిమాలో పాడేందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. వర్మగారు నాకు ఇన్స్పిరేషన్. నేను ఈ చిత్రంలో పాడిన పాట చాలా క్యాచీగా ఉంటుంది. ఈ చిత్రంలో పాడిన మిగిలిన సింగర్స్ కూడా చాలా బాగా పాడారు. అలాగే నిన్నటి నుంచి నాకు చాలా డిస్ట్రబింగ్ గా ఉంది. ప్రియాంకరెడ్డి ఇష్యూ అందరి మనసులను కలచివేసింది. ఒక ఆడపిల్లగా చాలా బాధగా ఉంది. అంతే కాక ఒక ఆడపిల్ల తల్లిగా భయంగా కూడా ఉంది. దయచేసి ఆడపిల్లలు ఏమన్నా సేఫ్టీగా మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవాలి. అసలు సేఫ్టీగా ఉండాలన్నది మన భారతదేశంలో ఉండకూడదన్నది నా ఆశ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ బాపినీడు. డిఒపి సింగర్స్ చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com