close
Choose your channels

షూటింగ్‌ పూర్తి చేసుకున్న కమల్‌హాసన్‌ 'చీకటిరాజ్యం'

Thursday, August 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రాజేష్‌ ఎం. స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్‌. చంద్రహాసన్‌ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చీకటిరాజ్యం`. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌, కిషోర్‌,సంపత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్‌ చాలా డిఫరెంట్‌ రోల్‌లో కన్పించబోతున్నారు. హైదరాబాద్‌, చెన్నై పలు అందమైన ప్రదేశాల్లో కేవం 40 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుకుంటోంది.

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ - ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. వెరీ డిఫరెంట్‌ జోనర్‌ ఫిల్మ్‌. నాుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. రెండు గంటలపాటు ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్‌ మంచి సంగీత దర్శకుడు.ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ ఆల్బమ్ ఇచ్చాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం`` అన్నారు.

దర్శకుడు రాజేష్‌ ఎం. స్వెల మాట్లాడుతూ ` కమల్‌హాసన్‌ గారిలాంటి గొప్ప నటుడితో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెగ్యులర్‌ సినిమాకు భిన్నంగా ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. గిబ్రాన్‌ వండర్‌ఫుల్‌ ఆడియోని ఇచ్చారు. సాను జాన్‌ వర్గుసే ఫొటోగ్రఫి విజువల్‌ ఫీస్ట్ లా ఉంటుంది. అలాగే అబ్బూరి రవిగారు సున్నితమైన డైలాగ్స్‌ రాశారు. యాక్షన్‌ సన్నివేశాలు కూడా చాలా కొత్తగా కంపోజ్‌ చేయడం జరిగింది. ఈ సినిమా నా కెరీర్‌కిమంచి బిగినింగ్‌ అవుతుంది.

ఈ చిత్రానికి ఆర్ట్‌: ప్రేమ్‌ నివాస్‌, ఎడిటర్‌: విజయ్‌ శంకర్‌, డైలాగ్స్‌: అబ్బూరి రవి, మ్యూజిక్‌: జిబ్రాన్‌, సిని మాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గుసే, నిర్మాత: ఎన్‌.చంద్ర హాసన్‌, దర్శకత్వం: రాజేష్‌ ఎమ్‌.సెల్వ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment