'చీకటి రాజ్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చీకటిరాజ్యం. విభిన్నంగా ఒకేరోజు జరిగే కథతో ఈ సినిమా రూపొందడం విశేషం.రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ సోదరుడు చంద్రహసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష..మళ్లీ ఇప్పుడు కమల్ తో కలసి నటించారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ్ లో తుంగవనం టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. మరి..చీకటి రాజ్యం తో కమల్ ఏరేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments