'చీకటి రాజ్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,October 30 2015]

కమల్ హాసన్ హీరోగా రాజేష్.ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చీకటిరాజ్యం. విభిన్నంగా ఒకేరోజు జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌డం విశేషం.రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ సోదరుడు చంద్రహసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష..మ‌ళ్లీ ఇప్పుడు క‌మ‌ల్ తో క‌ల‌సి న‌టించారు.

ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, సంప‌త్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ చిత్రాన్ని త‌మిళ్ లో తుంగ‌వ‌నం టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ పై మ‌రింత‌ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుక‌గా న‌వంబ‌ర్ 10న‌ విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. మ‌రి..చీక‌టి రాజ్యం తో క‌మ‌ల్ ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

More News

షేర్ మూవీ రివ్యూ

ఏ స్టార్ కైనా ఒక సినిమా హిట్ అయిందంటే తదుపరి సినిమాలపై ఆటోమేటిగ్గా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కల్యాణ్ రామ్ విషయంలోనూ జరిగింది అదే. ఆయనకు ఈ ఏడాది పటాస్ రూపంలో ఓ హిట్ వచ్చింది.

చిరు 150వ సినిమా ప్రకటించేది అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమానులు,ఇటు ఇండస్ట్రీ..ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ..ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

రవితేజ, బన్ని మాత్రమే..

చూస్తుండగానే 2015ముగింపు దశకు చేరుకుంటోంది.''బాహుబలి'',''శ్రీమంతుడు''వంటి బ్లాక్ బస్టర్ లతో ఈ ఏడాది ఘనంగానే కనిపిస్తున్నా..

బ్రూస్ లీ క‌లెక్ష‌న్స్ పై దాస‌రి కామెంట్

150 సినిమాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించిన గ్రేట్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు.

'కీచక' మూవీ రివ్యూ

మహాభారతంలో కీచక అనే క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్.అడవాళ్లను అత్యాచారాలు చేసే ఈ కీచకుడుకి పాండవులు బుద్ధి చెబుతారు. ఇది మన పురాణం.