‘చెక్’ ట్రైలర్: ఏదీ కర్మను తప్పించుకోలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
‘భీష్మ’తో హిట్ కొట్టిన అనంతరం యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది.
ట్రైలర్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో నితిన్ ఒక ఉరిశిక్ష పడిన ఖైదీగా నటించినట్టు తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం జైలులోనే చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. అక్కడ చెస్‌లో తన ప్రతిభ చూపించడం.. జైలులో ఉన్న ప్రత్యర్థులను ఎదుర్కోవడం... రకుల్ సాయంతో కేసు నుంచి చెస్ ఆడి బయటపడటం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. మొత్తానికి విలన్స్‌కి చెక్ పెట్టి తనకు పడిన శిక్ష నుంచి నితిన్ ఎలా తప్పించుకున్నాడనేదే ‘చెక్’ కథ. ఇక దర్శకుడు ఈ కథను ఎంత ఆసక్తికరంగా మలిచారనేదే తెలియాల్సి ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే మాత్రం సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందనే అనిపిస్తోంది.
‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. జైల్లో మరో ఖైదీతో మొదలైన నితిన్ ‘చెక్’.. జాతీయ స్థాయికి వెళ్తుంది. ‘ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా’ అంటూ మరో చెస్ ప్లేయర్ అనడం వంటి అంశాలతో పాటు.. ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్లో టచ్ చేశారు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout