ఏపీ-తెలంగాణల మధ్య చెక్ పోస్టులు ఎత్తేయలేదు..!

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 విధించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. కేంద్ర ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తు్న్నాయి. ఇప్పటికే
అంతర్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ-తెలంగాణ మధ్య చెక్ పోస్టులను ఎత్తేశారని.. ఇక ఎంచక్కా వెళ్లిపోవచ్చని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. అక్కడ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. బార్డర్‌కు వెళ్లిన వాహనాలన్నీ తిరిగొచ్చేస్తున్నాయ్. ఎందుకంటే గేట్లు ఎత్తేయలేదు. ఈ విషయమై ఏపీ కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్, సీనియర్ ఐఎఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

అవన్నీ అవాస్తవాలే..

‘అంతర్రాష్ట్రాల మధ్య చెక్ పోస్టులను తొలగించలేదు. తొలగించినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. కేసులు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, రాష్ట్ర చెక్ పోస్ట్‌ల వద్ద పరీక్షలు చేస్తున్నాము. అనేక కేసులు వెగులులోకి వస్తున్నాయి. అందువలన తప్పనిసరిగా క్రమబద్దీకరణ అవసరం. ఆంధ్రాకు వచ్చే వాళ్లంతా స్పందన వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. చెక్ పాయింట్ల వద్ద ప్రోటోకాల్ ప్రకారం టెస్ట్‌లు చేయించుకోవాలి. ఆరు రాష్ట్రాలలో ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడి నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఆంధ్రాకు వచ్చేవారు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు నడిపేందుకు తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇంకా ఇవ్వలేదు. అనుమతి ఇస్తే పాయింట్ టూ పాయింట్ బస్సులు నడిపేందుకు ఏపీ సిద్దంగా ఉంది’ అని కృష్ణబాబు మీడియాకు వెల్లడించారు.

More News

హీరోల్లారా.. జగన్‌రెడ్డికి మీరూ ఒక్క మాట చెప్పండి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్న విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా డైరెక్టర్ సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి!

తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి ‘రాజుగాడు’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయం అయిన సంజనారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

జగన్‌తో భేటీకి చార్టడ్ ఫ్లైట్‌లో చిరు, నాగ్, జక్కన్న

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు ఇవాళ భేటీ కానున్నారు.

కేసీఆర్, తలసానికి థ్యాంక్స్ చెప్పిన చిరు

టాలీవుడ్ సినిమా, టీవీ, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ సర్కార్.. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

చిరు సూచనతో ‘ఆచార్య’లో మార్పులు, చేర్పులు..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. అంతేకాదు.. బహుశా ఆయా రంగాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో..