'చెక్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్". రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . "జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ , కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.
ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ " నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది '' అని చెప్పారు.
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments