విజయ్ దేవరకొండ పేరుతో మోసం...

  • IndiaGlitz, [Sunday,September 13 2020]

సినీ ఇండస్ట్రీని ఉపయోగించుకుంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చూశాయి. శేఖర్ కమ్ముల పేరుతో మోసం.. సింగర్ సునీత పేరుతో డబ్బుల వసూళ్లు.. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నామని చెప్పి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం విజయదేవరకొండ దృష్టికి వెళ్లడంతో ఆయన టీం ప్రతినిధి అనురాగ్ పర్వతనేని ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘‘విజయ్ దేవరకొండ తో సినిమా తీస్తున్నామని ఆడిషన్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుగా ప్రకటనలు ఇస్తూ నటి నటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు మా దృష్టి కి వచ్చింది. విజయ్ దేవరకొండతో సంబంధం ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా అధికారికంగా విజయ్ మరియు అతని నిర్మాతలు ప్రకటిస్తారు. విజయ్ పేరు చెప్పి మోసగిస్తున్న నేరస్తులపై మేము చర్యలు చేపట్టాము. ఇలాంటి మోసగాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు వచ్చే సమాచారాన్ని రెండుసార్లు తనిఖీ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము’’ అని అనురాగ్ పర్వతనేని ప్రకటనలో పేర్కొన్నారు.

More News

బిగ్‌బాస్ నుంచి డైరెక్టర్ అవుట్.. గేమ్ ఆడటానికెళ్లి రచ్చబండ కబుర్లా..

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్క వారంలోనే ఆయన అంతులేని నెగిటివిటీని సంపాదించుకున్నారు.

స్మార్ట్‌గా కడిగిపారేసిన నాగ్.. కట్టప్ప ఎవరో చెప్పేశారు..

‘బాహుబలి’ టైటిల్ సాంగ్‌తో కింగ్ నాగార్జున ఎంట్రీ షోకే హైలైట్. బిగ్‌బాస్ షోలో కట్టప్ప ఎవరో తేల్చేద్దామంటూ ఆదిలోనే అదరగొట్టేశారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభం

ఇటీవల ఆగిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

అట్లీ డైరెక్ష‌న్‌లో బాద్షా..ల‌క్కీ హీరోయిన్‌తో జోడి..!

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో మూవీ చేయ‌బోతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో నా ఫీలింగ్ ఏంటంటే..: శ్రియా

మార్చిలో లాక్డౌన్ కావడానికి ముందే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే.