‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ పేరుతో దారుణం.. కేసు నమోదు

  • IndiaGlitz, [Friday,July 03 2020]

సోషల్ మీడియా మోసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అమ్మాయిల నంబర్లను సేకరించి సెలబ్రిటీల పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ అజయ్ భూపతి పేరుతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిల వివరాలను సేకరించాడు.

అంతటితో ఆగక సినిమా అవకాశాల పేరుతో ఆశ కల్పించి.. న్యూడ్ ఫోటోలను సైతం అమ్మాయిల నుంచి ఆ కేటుగాడు సేకరించాడు. ఆ తరువాత వేధింపులకు తెరదీశాడు. విషయం అజయ్ భూపతికి తెలియడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.