కోన వెంకట్‌పై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం

  • IndiaGlitz, [Sunday,September 29 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఉండే సినీ ప్రియులకు ప్రముఖ రచయిత కోన వెంకట్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన రాసే కథలు, డైలాగ్స్ అలా ఉంటాయి గనుక. సామాజిక స్పృహ కలిగిన.. ఎలాంటి విబేధాలనైనా పరిష్కరానికి కంకణం కట్టుకుంటుంటారు. అయితే అలాంటి వ్యక్తే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదదైంది.

ఓ కథ ఇస్తానని చెప్పి రూ.13.5 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోన వెంకట్‌పై జెమిని ఎఫ్ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అయితే.. సినిమా కథ ఇవ్వకపోగా, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. డబ్బులు అడుగుతుంటే తననే బెదిరిస్తున్నారంటూ ప్రసాద్ పోలీసులకు వివరించారు. ఓ సారి ఫోన్‌ చేయగా దుర్భషలాడినట్లు ఫిర్యాదుదారుడు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మధ్యవర్తి భానును నిర్వాహకులు నిలదీయగా కోన వెంకట్‌ అమెరికాలో ఉంటున్నట్టు చెప్పాడు.

ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ కోన వెంకట్ మాత్రం మీడియా ముందుకు వచ్చి గానీ.. సోషల్ మీడియా వేదికగా గానీ స్పందించలేదు. అయితే ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

‘సైరా’ను చిరంజీవే ఎందుకు చేశారు..!?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో

అమితాబ్ మాట‌ను ర‌జనీ విన‌డం లేదా?

అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ద‌క్షిణాది స్టార్ హీరోలైన ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి చిర‌కాల మిత్రులు. వీరిద్ద‌రికీ అమితాబ్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

చంద్రబాబుకు ఈ చెత్త సలహా ఇచ్చిందెవరబ్బా!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు కొందరు పనిగట్టుకుని మరీ చెత్త సలహాలిస్తున్నారా..? బాబును డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారా..?

ప‌వ‌న్ గురించి అమితాబ్ ఏమ‌న్నాడంటే...

అక్టోబ‌ర్ 2న `సైరా న‌రసింహారెడ్డి` ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో విడుద‌ల కానుంది.

దసరాకు భారీ షాకిచ్చిన రైల్వే శాఖ!

ఇదేంటి దసరాకు బంపరాఫర్ ఇవ్వాల్సింది పోయి.. భారీ షాకివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.