చిక్కుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ... చీటింగ్ కేసుపెట్టిన ఫైనాన్షియర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్, ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లు చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. వి.ఎస్.శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఈరోజున సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్‌లపై కేసు పెట్టారు. వీరిద్దరూ 2018-19 మధ్య కాలంలో తన దగ్గర నుంచి రూ.85 లక్షలు రుణంగా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన అకౌంట్ నుంచి చాలా మంది టెక్నీషియన్స్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ చేశారని.. ఇప్పుడు బాకీ గురించి అడుగుతుంటే సరిగ్గా స్పందించక పోగా.. తనను బెదిరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించాడు.
తన దగ్గర నుంచి డబ్బులు తీసుకునే సమయంలో తనను సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేస్తానని చెప్పినట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. శ్రవణ్ ఫిర్యాదుపై కేసును నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ కేసు విషయమై బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా త్వరలోనే ఓ స్టార్ డైరెక్టర్‌తో కలిసి పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు కూడా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments