గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతున్న ఛత్రపతి రీమేక్.. ఈ విశేషాలు తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఛత్రపతి రీమేక్ లో శ్రీనివాస్ బాలీవుడ్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర గ్రాండ్ లాంచ్ కి రంగం సిద్ధం అయింది. శుక్రవారం హైదరాబాద్ లో అతిరథమహారథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ తన హార్డ్ వర్క్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రాల హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంటే నార్త్ ఆడియన్స్ లో కూడా శ్రీనివాస్ కు పట్టు ఉంది.
బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు శ్రీనివాస్ తొలి చిత్రంగా రాజమౌళి, ప్రభాస్ ల బ్లాక్ బస్టర్ ఛత్రపతి చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ చిత్రం కోసం తన మేకోవర్ మార్చుకున్న శ్రీనివాస్, ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. బాలీవుడ్ లో నటించడం కోసం శ్రీనివాస్ ముంబై జుహు ప్రాంతంలో ఫ్లాట్ కూడా తీసుకున్నాడు.
బాలీవుడ్ సెలెబ్రిటీ ట్రైనర్ ప్రశాంత్ సావంత్ ఆధ్వర్యంలో బెల్లకొండ శ్రీనివాస్ ఫిజికల్ ట్రైనింగ్ పొందాడు. షారుఖ్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ కి ప్రశాంత్ ట్రైనర్ గా పనిచేశారు.
ప్రతిష్టాత్మక పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఛత్రపతి చిత్రాన్ని రచించిన విజయేంద్ర ప్రసాద్ రీమేక్ కి కూడా పనిచేస్తున్నారు. నార్త్ నేటివిటీకి అనుగుణంగా ఆయన కథలో మార్పులు చేస్తున్నారు. హీరోయిన్ పాత్రని మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్..భజరంగి భాయీజాన్, మణికర్ణిక లాంటి బాలీవుడ్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.
ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు, గ్రాండ్ గా లాంచ్ అయ్యేందుకు అంతా సిద్ధం అయింది. హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మించగావర్షాలకు దెబ్బతినింది. దీనితో తిరిగి మరమ్మతులు చేశారు. శుక్రవారం రోజు గ్రాండ్ గా ఈ చిత్రం లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి హాజరు కాబోతున్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com