చార్మి డిస్కౌంట్ ఇస్తానంటోంది
- IndiaGlitz, [Monday,July 08 2019]
చార్మింగ్ చార్మి డిస్కౌంట్ ఇస్తానని అనాలేగానీ, కుర్రకారు ఎగబడకుండా ఉంటారా? తమకు నచ్చింది చేజిక్కించుకోకుండా ఉంటారా? అని అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఛార్మి డిస్కౌంట్ ఇస్తానన్నది మరెందులోనో కాదు.. ఆమె కొత్తగా మొదలుపెట్టిన దుస్తులకు. ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి బిఇస్మార్ట్ డాట్ ఇన్ అనే పేరుతో ఆన్‌లైన్‌లో వస్త్రాలను విక్రయించనున్నారు. ఇందులో కేవలం అబ్బాయిల దుస్తులను మాత్రమే విక్రయించనున్నారు. వీటిలో ముందు ఆర్డర్ చేసుకున్న వారికి 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు చార్మి ట్విట్టర్‌లో తెలియజేశారు.
ఈ విషయాన్ని వరంగల్‌లో జరిగిన 'ఇస్మార్ట్ బోనాలు' వేడుకలో పూరి జగన్నాథ్ కూడా వెల్లడించారు. పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ కథానాయకుడు. నభా నటేష్, నిధి అగర్వాల్ నాయికలు. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. ముందు 12 విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ క్రికెట్ పోటీలను దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేశారు. మణిశర్మ సంగీతం అందించిన సినిమా ఇది.