Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఆగే సమయంలో ఒక్కసారిగా కుదుపుకు గురై ఫ్లాట్‌ఫాం సైడ్ గోడలను ఢీకొట్టింది. ఆ సమయంలో రైలు ఆగుతుంది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. కొంతమంది ప్రయాణికులు స్వల్పగాయాలయ్యాయి. హఠాత్‌పరిణామంతో మరికొంతమంది ప్రయాణికులకు గుండెపోటు వచ్చింది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన ఇవాళ ఉదయం 9.15 గంటల సమయంలో చోటుచేసుకుంది. డెడ్ ఎండ్ గోడను రైలు ఢీకొట్టడంతో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ రైలు నుంచి దిగే ప్రయ్నతం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని కానీ కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. దీనిపై మరింత దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించింది.

మరోవైపు నాంపల్లిలో జరిగిన ఈ రైలు ప్రమాదం ఘటనపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాలని సూచించారు.

More News

Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను

Film Chamber: సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియాకు ఫిల్మ్‌ ఛాంబర్ వార్నింగ్..

ఈసారి సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో గతంలో ఎన్నడూ లేని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి పోటీ విపరీతంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిదంటూ జోరుగా

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'గుంటూరు కారం' బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "గుంటూరు కారం'సినిమా. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

YSRCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. పలువురు సిట్టింగ్‌లకు షాక్..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపుపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను

AP Politics: పార్టీలు మారిన నేతలపై పోటాపోటీ ఫిర్యాదులు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు రంజుగా మారుతోంది. ఎప్పుడూ ఏ పార్టీ నుంచి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమవుతోంది. మరో రెండు నెలల్లో జరగనున్న