టిక్ టాక్ వీడియో వివాదాస్పదం... సారీ చెప్పిన ఛార్మి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి వ్యాపించింది. దీంతో ప్రభుత్వ యంత్రాగం అంతా అప్రమత్తమైంది. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘హైదరాబాద్‌కు కరోనా వచ్చిందట..ఆల్ ది బెస్ట్ గయ్స్’ అంటూ ఛార్మి చేసిన ఓ టిక్ టాక్ వీడియో వివాదాస్పదంగా మారింది. దీంతో నెటిజన్లు ఛార్మిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై ఓ రేంజ్లో విమర్శలు రావడంతో తన తప్పేంటో తెలుసుకున్న ఛార్మి వెంటనే దిగొచ్చింది..క్షమాపణలు చెప్పింది. ‘‘మీ కామెంట్స్ అన్నీ చదివాను. చాలా సెన్సిటివ్ విషయంపై అవగాహన లేకుండా.. అపర్వికతతో మాట్లాడాను. ఇకపై భవిష్యత్తులో ఇలాంటి అంశాలపై జాగ్రత్తగా వ్యవహరిస్తాను’’ అంటూ ట్వీట్ చేసింది. అయితే తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించింది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ 19(కరోనా వైరస్) తెలంగాణకు పాకింది. మహేంద్ర హిల్స్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ప్రజలు ఇంటి నుండి రావడానికి భయపడుతున్నారు. సదరు ఇంజనీర్ ఈ నెల 22న బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చారు. ఆయన ఆ రోజు నుండి వైరస్ ధృవీకరణ వరకు 80 మందితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఆరోగ్యశాఖ ఉండగా.. సదరు యువకుడు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments