చార్మి ఇంట విషాదం.. నిన్ననే చివరి వీడియో కాల్ అంటూ భావోద్వేగం

  • IndiaGlitz, [Friday,July 17 2020]

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెకు చాలా ఆప్తురాలైన అత్త మృతి చెందారు. దీంతో చార్మి తన అత్త ఫోటోను పోస్టు చేస్తూ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తన అత్త లేరనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొంది. నిన్ననే ఆమెతో చివరి సారిగా వీడియో కాల్ మాట్లాడానని కానీ అదే చివరదవుతుందని భావించలేదని చార్మి పేర్కొంది.

‘‘మీరు లేరనే వార్తను నేనెప్పటికీ జీర్ణించుకోలేను. కానీ జీవితం తన సొంత నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. నిన్ననే మనం చివరి సారిగా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని నేను ఊహించలేదు. నాకు మాటల్లేవు. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని భావిస్తున్నా. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. నీ చిరునవ్వుని ఎప్పటికీ నేను మరిచిపోతున్నా.. మై డియరెస్ట్ ఆంటీ.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని చార్మి ట్వీట్‌లో పేర్కొంది.

More News

తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు 40 వేలు దాటేశాయి.

గిరిజన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సెంథిల్..

ధర్మపురి ఎంపీ సెంథిల్ కుమార్ గిరిజన విద్యార్థులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు.

విజయ్ దేవరకొండ 'ఇన్ స్టా గ్రామ్' లో 8 మిలియన్ ఫాలోయర్స్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ..