చార్మి ఇంట విషాదం.. నిన్ననే చివరి వీడియో కాల్ అంటూ భావోద్వేగం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత చార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెకు చాలా ఆప్తురాలైన అత్త మృతి చెందారు. దీంతో చార్మి తన అత్త ఫోటోను పోస్టు చేస్తూ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తన అత్త లేరనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొంది. నిన్ననే ఆమెతో చివరి సారిగా వీడియో కాల్ మాట్లాడానని కానీ అదే చివరదవుతుందని భావించలేదని చార్మి పేర్కొంది.
‘‘మీరు లేరనే వార్తను నేనెప్పటికీ జీర్ణించుకోలేను. కానీ జీవితం తన సొంత నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. నిన్ననే మనం చివరి సారిగా వీడియో కాల్లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని నేను ఊహించలేదు. నాకు మాటల్లేవు. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని భావిస్తున్నా. పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. నీ చిరునవ్వుని ఎప్పటికీ నేను మరిచిపోతున్నా.. మై డియరెస్ట్ ఆంటీ.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని చార్మి ట్వీట్లో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout