నందమూరి బాలయ్యపై చార్మీ కామెంట్స్..

  • IndiaGlitz, [Tuesday,May 19 2020]

నందమూరి బాలకృష్ణపై నటి కమ్ నిర్మాత చార్మీ కామెంట్స్ చేసింది. ఇటీవలే తాను ఇక నటించనని.. ఇది వందకు రెండొందల శాతం పక్కా అని చెప్పిన ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఓ నందమూరి అభిమాని అడిగిన ప్రశ్నకు బాలయ్యపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.‘బాలయ్య ఎంతో పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. బాలకృష్ణ- పూరీ జగన్నాథ్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణతో సినిమా అంటే కథకు ప్రాధాన్యత ఉంటుంది. ఆయనతో సినిమాకు పూరీ ఎప్పుడూ రెడీ. స్క్రిప్టు కుదిరితే ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది’ అని చార్మీ తన మనసులోని మాటను బయటపెట్టింది.

కాగా.. లాక్ డౌన్‌లో బాలయ్య కోసం పూరీ జగన్నాథ్ కథ రెడీ చేస్తున్నాడని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పైసా వసూల్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణనే దక్కించుకుంది. ముఖ్యంగా బాలయ్యను పూరి తనదైన మేకింగ్‌ స్టైల్‌లో చూపించిన విధానం నందమూరి అభిమానులకు భలే కిక్‌నిచ్చింది. అందుకే బాలకృష్ణ కూడా మళ్లీ పూరితో చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఇదివరకే పలుమార్లు డ్యాషింగ్ డైరక్టర్ చూపిస్తున్నట్లు ఆయన మాటలే తెలిపాయి. కాగా.. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించి పూరీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం.. పూరి ఏకంగా క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.