వారి కోసం ఛార్మి త్యాగం
Send us your feedback to audioarticles@vaarta.com
ఛార్మింగ్ గాళ్ ఛార్మి పొడుగుగా ఉండే తన హెయిర్ ను సడన్ గా భుజాల వరకు కత్తిరించేసుకున్నారు. ఇంతకీ ఎందుకిలా చేసారు..సినిమాలో గెటప్ కోసమా అని అడిగితే..క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు యువతులకు విగ్గు తయారు చేయించడం కోసం ఇలా చేసాను అంటున్నారు. ఇటీవల ఛార్మి ఫ్రెండ్...తను ఉండే ప్రదేశంలో ఇద్దరు యువతులు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వారికి నువ్వంటే ఇష్టం అని ఛార్మికి చెప్పాడట. దీంతో ఛార్మి వాళ్లని కలిసిందట.
క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరుగుతున్న కారణంగా వారిద్దరూ హెయిర్ ని కోల్పోయారట. ఛార్మి వాళ్లని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఛార్మి అక్కా మీ జుట్టు చాలా బాగుంది అని అన్నారట. దీంతో తన హెయిర్ స్టైలీష్ట్ ని పిలిచి 18 అంగుళాలు గల జుట్టును కత్తిరించి రెండు విగ్గులుగా తయారు చేయించమని చెప్పిందట. ఆ విగ్గులను వారికి బహుమతిగా ఇస్తాను. అప్పుడు వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అని ఛార్మి ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పింది. ఇదీ..క్యానర్స్ బాధిత ఇద్దరు యువతులు కోసం ఛార్మింగ్ గాళ్ ఛార్మి చేసిన త్యాగం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments