విల‌న్ కావాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను - చ‌ర‌ణ్‌దీప్‌

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం' సినిమా గురించి విన‌ప‌డుతున్న వార్త‌లు. సినీ ప్రేక్ష‌కులే కాదు. సినీ ప్ర‌ముఖులు, స్టార్ హీరోలు..ఇలా సినిమా చూసిన వారంద‌రూ సినిమా అద్భుతంగా ఉంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు యాంగ్రీ యంగ్ మేన్‌గా తిరుగులేని విజ‌యాల‌ను సాధించిన డా.రాజ‌శేఖ‌ర్‌కు పిఎస్‌వి గ‌రుడ‌వేగ స‌క్సెస్‌తో మంచి పేరొచ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు టేకింగ్‌, అమోఘ‌మైన స్క్రిప్ట్‌, అందుకు త‌గిన విధంగా డిజైన్ చేసిన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు స‌రిపోయిన న‌టీనటులు..వీరంద‌రిని పెర్ఫార్మెన్స్‌ను మ‌రో లెవ‌ల్‌లో నిల‌బెట్టిన సాంకేతిక నిపుణులు.

ఇవే గ‌రుడ‌వేగ స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణాలు. జ్యోస్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌. న‌వంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. సినిమా విడుద‌లైన ప‌ది రోజులు 22 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి, విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించిన

న‌టుడు చ‌ర‌ణ్ దీప్ మాట్లాడుతూ - " 'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18ఎం' చిత్రంలో వెంకట్రావ్ అనే ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాను. సినిమాల్లో ఒక గుర్తింపు వ‌చ్చిన త‌ర్వాత పాజిటివ్ పాత్ర‌లో న‌టించిన సినిమా గ‌రుడ‌వేగ‌. ఈ సినిమాలో నా రోల్ పూర్తి సినిమా వ‌ర‌కు ఉంటుంది. గ‌తంలో నేను హీరోగా న‌టించిన 'అంతం' సినిమా పెద్ద‌గా రెస్పాన్స్ తెచ్చిపెట్ట‌లేదు.

నేను ఎక్కువ‌గా విల‌న్‌గానే సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చాను. నేను పూర్తిస్థాయి పాజిటివ్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. సినిమా ప‌ది రోజుల‌కే 22 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మూడో వారంలో అడుగుపెట్టిన త‌ర్వాత కూడా సినిమా ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. నేను బి.టెక్‌.ఎంబిఎ చ‌దివిన త‌ర్వాత సినిమాల‌పై ఆస‌క్తితో ఈ రంగంవైపు వ‌చ్చాను. సాధార‌ణంగా మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు బాలీవుడ్ విల‌న్స్‌కే ఎందు ప్రాధాన్య‌మిస్తార‌ని ఆలోచించాను.

వారు ఫిజిక‌ల్‌గా స్ట్రాంగ్‌గా క‌న‌ప‌డ‌తారు కాబ‌ట్టే వారికే మన‌వారు ప్రాధాన్యత ఇస్తార‌ని అర్థ‌మై..నేను కూడా మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ బాడీ బిల్డ‌ప్ చేశాను. త‌ర్వాత బిల్లా రంగా, తుంగ‌భద్ర వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేశాను. అయితే పూరి జ‌గ‌న్నాథ్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లోఫ‌ర్ నాకు న‌టుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. లోఫ‌ర్ త‌ర్వాత పిఎస్‌వి గ‌రుడ‌వేగ చిత్ర‌మే నాకు ట‌ర్నింగ్ పాయింట్‌.

నేను విల‌న్ అవుదామ‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. అయ్యాను కూడా. అయితే నేను పాజిటివ్‌గా చేసిన పాత్ర‌ను ఆడియె్న్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు.ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ సినిమాతో పాటు మ‌రో సినిమా కూడా చేస్తున్నాను. అలాగే మ‌హేష్ 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. అలాగే నేను కీల‌క‌పాత్ర చేసిన శ‌ర‌భ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది" అన్నారు.