ఆ డైరెక్టర్‌తో చరణ్‌కి ఈసారైనా వర్కవుట్‌ అయ్యేనా..?

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివకు ఎందుకనో సినిమా కుదరడమే లేదు. ప్రారంభంలో వీరిద్దరి కలిసి 'మెరుపు' అనే సినిమా చేయాలనుకున్నారు. సినిమా లాంఛనంగా కూడా ప్రారంభమైంది. కానీ..ఎందుకనో సినిమా ఆగిపోయింది. తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనేలేదు. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చేస్తున్న 'ఆచార్య' చిత్రంలో రామ్‌చరణ్‌ నటించనున్నాడు. చరణ్‌ పవర్‌ఫుల్‌ నక్సలైట్‌ నాయకుడు పాత్రలో కనిపించున్నాడని సమాచారం. అయితే ఇది కీలకపాత్ర మాత్రమే. ఫుల్‌లెంగ్త్‌ హీరోగా చరణ్‌ సినిమా చేయలేదు. అసలు కొరటాల, చరణ్‌ కాంబినేషన్ సినిమా ఉంటుందా? అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అయితే లేటెస్ట్‌ సినీ వర్గాల సమాచారం మేరకు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి ఓ అంగీకారానికి వచ్చారట.

వివరాల్లోకెళ్తే.. కొరటాల శివ స్నేహితుడు సతీష్‌ కిలారు నిర్మాణంలో రామ్‌చరణ్‌ హీరోగా కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నారట. రీసెంట్‌ చరణ్‌కు కొరటాల ప్లాట్‌ వివరించాడట. పాయింట్‌ నచ్చడంతో సినిమా చేయడానికి చరణ్‌ ఓకే చెప్పాడని టాక్‌. ప్రస్తుతం చరణ్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆచార్యను పూర్తి చేసి తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి కొరటాల రెడీ అయిపోతాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే చరణ్‌తో సినిమాను ట్రాక్‌ ఎక్కిస్తారు. అంటే 2022లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది.