చరణ్ ఇలా కష్టపడుతున్నాడు......
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన నెక్ట్స్ సినిమాగా తనీ ఒరువన్ రీమేక్ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయాడు. తెలుగులో ఈ సినిమాకు ధ్రువ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో చరణ్ ఐపియస్ ఆఫీసర్ పాత్రలో కనపడనున్నాడు. అందుకని ఈ సినిమాలో తన లుక్ కోసం చరణ్ బాగా కష్టపడిపోతున్నాడట.
జిమ్ లో బాగా సమయం గడుపుతున్నాడు. కేవలం జిమ్ లో చేసే ఎక్సర్ సైజస్ కాకుండా తీసుకునే ఆహారం విషయంలో కూడా కేర్ తీసుకున్నాడు. బ్రేక్ ఫాస్ట్ లో వైట్ ఎగ్స్, సలాడ్స్, ప్రొటీన్ షేక్ తీసుకుంటున్నాడు. అలాగే ఫ్రూట్ ప్లాటర్, వైట్ సాండ్ విచ్ లతో లైట్ మీల్ తీసుకుంటున్నాడట. రైస్ తినడం లేదట. వాటర్ ఎక్కువ తాగడం, లైట్ మీల్ తర్వాత ఆరగంట పాటు చిన్న కునుకు కూడా తీసున్నాడట. తెరపై ప్రేక్షకులను కనువిందు చేయడానికి హీరోలు చాలా కష్టాలే పడుతున్నారనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout