బ‌న్నితో మ‌న‌కు అంత సీన్ లేద‌న్న చ‌ర‌ణ్‌..!

  • IndiaGlitz, [Tuesday,August 23 2016]

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లు మెగా హీరోలు, అభిమానుల స‌మ‌క్షంలో శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌కు మెగా హీరోలు నాగ‌బాబు, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.అయితే... బ‌న్ని ఫ్యాన్స్ కి, ప‌వ‌న్ ఫ్యాన్స్ కి కోల్డ్ వార్ న‌డుస్తుండ‌డం వ‌ల‌న అనుకుంట...రామ్ చ‌ర‌ణ్ తో బాగా క్లోజ్ గా ఉండేందు ప్ర‌య‌త్నించాడు బ‌న్ని.

రామ్ చ‌ర‌ణ్ స్టేజ్ పై మాట్లాడుతుంటే...ఫ్యాన్స్ మాకు మెగాస్టార్ కావాలంటూ నినాదాలు చేయ‌డం మొద‌లెట్టారు. అప్పుడు బ‌న్ని స్టేజ్ పైకి వ‌చ్చి కొంచెం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి చ‌ర‌ణ్ చేతిలో మైక్ తీసుకుని అభిమానుల‌ను ఉద్దేశించి మెగాస్టార్ కావాలి అంటారు ఏమిటి...? అని రామ్ చ‌ర‌ణ్ ని చూపించి ఇత‌నే మెగాస్టార్ అన్నాడు. బ‌న్ని అత్యుత్సాహానికి అడ్డుక‌ట్ట వేస్తూ చ‌ర‌ణ్...బ‌న్నితో మ‌న‌కు అంత సీన్ లేదు అన్నాడు అది సంగ‌తి..!