రామ్ చరణ్ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా అక్టోబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ ట్ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.
ప్రస్తుతం రవితేజ్ కిక్2` విడుదల సన్నాహాల్లో బిజీగా ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఈ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని టాక్. ఈ సినిమా నవంబర్ నుండి చిత్రీకరణను జరుపుకోవచ్చనంటున్నారు. రేసుగుర్రం` తర్వాత మెగా ఫ్యామిలీతో సురేందర్ చేస్తున్న సినిమా ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments