మరో రీమేక్ ప్లాన్ లో చరణ్...
Saturday, January 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ను ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే...బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన రాఖీ హ్యాండ్సమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. రాఖీ హ్యాండ్సమ్ కథ గురించి శృతిహాసన్ చరణ్ తో చెప్పిందట. పాయింట్ నచ్చడంతో చరణ్ ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి..ఇదే కనుక నిజమైతే...ఈ సంవత్సరంలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments