రిజెక్ట్ చేసిన పూరి గారు శభాష్ అనడం నా తొలి సక్సెస్ ... లోఫర్ విలన్ చరణ్ దీప్
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్ టు లోఫర్ మీ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి..?
నిజంగా ఇయర్ ఫెంటాస్టింక్ గా గడిచింది. పటాస్ సక్సెస్ టూర్ తో మొదలైన నా జర్నీ లోఫర్ సక్సెస్ టూర్ తో ముగిసింది. ప్రత్యేకంగా లోఫర్ సక్సెస్ టూర్ లో నాకు ప్రేక్షకులనుండి వచ్చిన స్పందన చాలా బాగుంది. అందరూ నన్ను తిట్టుకుంటుంటే ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యాననే సంతోషం గలిగింది.
లోఫర్ ప్రాజెక్ట్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది..?
పూరి గారితో పనిచేయాలనేది నా డ్రీమ్ .. గోలీమార్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను వెళ్ళాను. నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ సెలెక్ట్ అయ్యాడని కో డైరెక్టర్ చెప్పాడు .. నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కానీ నేను సెలెక్ట్ కాలేదు, దీంతో ఆ రోజు చాలా ఏడ్చాను, ఆ ఏడుపు ఒక కసిని నాలో పెంచింది. ఎప్పటికయినా పూరి గారి దర్శకత్వంలో పనిచేయాలని గట్టిగా అనుకున్నాను. అది లోఫర్ తో నెరవేరింది, పూరి గారికి ఆ విషయం చెబితే నాకు గుర్తు లేదని అన్నారు.
పూరి తో మీ జర్నీ ఎలా నడిచింది?
నిజానికి పూరి గారి నాలెడ్జ్ లో సినిమా కేవలం పదిశాతమే. ఆయనకి సమాజం పై ఉన్న అవగాహాన చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అభిమానిగా ఉన్న నేను ఆయన ఫాలోవర్ ని అయిపోయాను. పూరి గారి వర్కింగ్ స్టైల్ కి అలవాటు పడిన తర్వాత నా ఆలోచనలు చాలా మారాయి. ఆయనకు ఎప్పటికీ రుణ పడిపోయిఉంటాను. లోఫర్ మూవీ లో నా క్యారెక్టర్ ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది.
కొడుకు ఎలా ఉండకూడదో మీ క్యారెక్టర్ చెబుతుంది మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది..?
మా ఇంట్లో నా క్యరెక్టర్ ని తిట్టుకుంటూనే ఎంజాయ్ చేసారు.. ముఖ్యంగా మదర్ ని చంపే సన్నివేశంలో అయితే నాకు చాలా తిట్లు పడ్డాయి మా అమ్మనుండి కానీ అవన్నీ నాలో ఆర్టిస్ట్ కి కాన్ఫిడెంట్ పెంచాయి.
వరుణ్ తేజ్ తో మీ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది.?
మెగా ఫ్యామిలీనుండి వచ్చిన హీరో లా కాకుండా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. క్లైమాక్స్ ఫైట్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ వాళ్ళందరూ వరుణ్ కి సరైన పొటీ దొరికింది అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రిలీజ్ తర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుండి వినిపించడం డబుల్ హ్యపీ.
తెలుగుకి మంచి టఫ్ విలన్ దొరికాడని అనిపిస్తుంది...?
థ్యాంక్స్... బాలీవుడ్ నుండి విలన్స్ ని తెచ్చుకోవడం తప్పేమీకాదు.. దర్శకుడి అంచనాలకు తగ్గట్లు మనం తయారు అవగలిగితే తెలుగు వారికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆ అవగాహన లేకుండా నేను కొంత టైం వేస్ట్ చేసాను.. కానీ తర్వాత సిక్స్ ప్యాక్ చేసాను.. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను.. ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. పూరిగారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు.
కన్నడ లో బాక్సర్ మూవీతో ఎంటర్ అయ్యారు..?
అవును.. ఆ మూవీ అక్కడ మంచి విజయం సాధించింది. దర్శన్ హీరోగా చేసిన ఆ మూవీ లో నేను విలన్ గా చేసాను. సిక్స్ ప్యాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాహుబలి 2 లో ఉన్నారా..?
రాజమౌళి గారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన కాలకేయ తమ్ముడి క్యారెక్టర్ రెండో పార్ట్ కి లింక్ అవుతుందని చెప్పారు. మార్చి లో నా పాత్ర షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. సో.. చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నా..
విలన్ గానే కంటిన్యూ అవుతారా..?
నాకు మొదటినుండి విలన్ రోల్స్ అంటే చాలా ఇష్టం. కోటాగారు నా ఫేవరేట్ విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం.. అటుగానే నా జర్న ఉంటుంది. తమిళంలో జిల్లా చేసాను మంచి పేరు వచ్చింది. పులి కోసం విజయ్ గారు అడిగితే డేట్స్ అడ్జెక్ట్ కాక కురదలేదు. ఇప్పడు శంకర్ శిష్యుడు చేస్తున్న మూవీలో మెయిన్ విలన్ గా చేస్తున్నాను..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout