Charan Couple:శ్రీవారిని దర్శించుకున్న చెర్రీ దంపతులు.. క్లీంకార ఫోటో రివీల్..
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజును మెగా అభిమానులు గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చరణ్ మాత్రం తన పుట్టినరోజుని కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి అశీసులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే స్వామి వారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కుమార్తె క్లీంకారను ఉపాసన ఎత్తుకుని గుడి లోపలికి వెళ్తున్నారు. ఆ సమయంలో క్లీంకార ఫేస్ కెమెరాకు చిక్కింది. ఇప్పటివరకు చెర్రీ దంపతులు క్లీంకార ఫేస్‌ను రివీల్ చేయలేదు. దీంతో మెగా అభిమానులంతా తమ వారసురాలి ఫేస్ ఎలా ఉందో చూడడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల 'గేమ్‌ఛేంజర్' మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరిగినప్పుడు కూడా ఆర్కే బీచ్‌లో సందడి చేస్తున్న సమయంలో క్లీంకారను చూసేందుకు ఆసక్తి చూపారు. అయినా కానీ పాప ముఖం కనపడలేదు.
ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి. చెర్రీ పుట్టినరోజున అది కూడా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో క్లీంకార ఫేస్ క్లియర్‌గా కనిపించింది. దీంతో మెగా ప్రిన్స్‌స్, చిరంజీవి మనవరాలు ఎంత క్యూట్‌గా ఉందో అంటూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. సేమ్ చెర్రీ లాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకెందుకు మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.
ఇక చరణ్ బర్త్ డే సందర్భంగా 'గేమ్‌ఛేంజర్' మూవీ నుంచి ‘జరగండి’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకి చెర్రీ, కియారా వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక దర్శకుడు శంకర్ డిజైన్ చేసిన ఈ సాంగ్ విజువల్ వండర్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే పాటను రిలీజ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments