'ఊపిరి'లో ఎవరి పాత్రలు ఏమిటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
'బృందావనం', 'ఎవడు' చిత్రాల విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఈ సక్సెస్ఫుల్ దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగులో 'ఊపిరి'గా, తమిళంలో 'తోళా' గా ఈ సినిమా రూపొందుతోంది. 'సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా, అనుష్క (అతిథి పాత్ర), జయసుధ వంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమాకి 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'భలేభలే మగాడివోయ్' ఫేమ్ గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. ఫ్రెంచ్ ఫిల్మ్ 'ది ఇన్‌టచబుల్స్'కి ఇది అఫీషియల్ రీమేక్.
కాగా.. ఇందులో ఎవరి పాత్ర ఏమిటనే దానికి కార్తీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరాలు అందించారు. దాని ప్రకారం.. అనుకోని పరిస్థితుల్లో వీల్ ఛైర్‌కి పరిమితమయి.. మనోవేదనకు గురయ్యే మల్టీ బిలియనీర్ విక్రమ్ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. ఇక..కార్తీది నిరుపేద అనాధ క్యారెక్టర్. జీవితంలో అనూహ్యంగా ఎదగాలనుకునే ఈ పాత్ర.. ఏ పరిస్థితుల్లో నాగ్ వద్దకు చేరుకుంది అనేది సినిమాలో కీలకాంశం. ఇక తమన్నా.. నాగ్‌కి సెక్రటరీ పాత్రలో దర్శనమివ్వనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments