`చపాక్` షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాధారంగా చేసుకుని ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే `చపాక్` అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నటిస్తున్నారు. మేఘనా గుల్జార్ దర్శకురాలు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో నటించడమే కాదు.. నిర్మాణంలో కూడా దీపికా పదుకొనె భాగస్వామిగా మారారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ యూనిట్ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ``ఇది నా కెరీర్లో అత్యుత్తమ సినిమా. చపాక్ సినిమాను 2020 జనవరి 10న చూడొచ్చు` అని మెసేజ్ పోస్ట్ చేశారు. దీనిపై రణవీర్ సింగ్ స్పందిస్తూ `ఈ అద్భుతాన్ని చూడటానికి నేనింకా వెయిట్ చేయలేను` అంటూ ఆ పోస్ట్‌కు దీపికా భర్త, హీరో రణవీర్ సింగ్ రిప్లై ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com