జగన్ క్యాంప్ ఆఫీస్‌లో కీలక మార్పు.. ధర్మచక్రం ఔట్!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలన ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ చేసిన పనులన్నీ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం.. అధికార యంత్రాగాన్ని శరవేగంగా మార్చేయడం.. కూల్చివేతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరోవైపు కీలక నిర్ణయాలు, సంచాలనాత్మక నిర్ణయాలు తీసుకుని జాతీయ మీడియాలోనూ జగన్ నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సీఎం క్యాంప్ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది.

ధర్మ చక్రం ఔట్..

అధికారులు, కేబినెట్‌ సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో ముఖ్యమంత్రి కూర్చునే సీటుకు వెనుక భాగంలో ఇదివరకూ బౌధ్ద ధర్మచక్రం ఉండేదన్న విషయం తెలిసిందే. ఇది నారా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయించారు. అప్పట్లో లక్షలు పోసి దీన్ని ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నమైన ఆ ధర్మ చక్రం పీకేసిన జగన్.. ఆ స్థానంలో ఏపీ ప్రభుత్వం చిహ్నం ‘సత్యమేవ జయతే’ ని ఏర్పాటు చేయించారు. కాగా.. మంగళవారం నాడు జరిపిన సమీక్షలో ధర్మచక్రం ఉండగా.. బుధవారం నాడు జరిపిన చర్చలో మాత్రం బ్యాగ్రౌండ్ మారిపోయింది. అయితే ధర్మచక్రం తొలగింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీల చెందిన కార్యకర్తలు, అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చిత్ర విచిత్రాలుగా కామెంట్స్..

‘హంగు ఆర్భాటం కాదు కావాల్సింది. ఇది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అని తెలియడం కోసం తీసుకున్న చక్కని నిర్ణయం. ప్రచారం ముఖ్యం కాదు. రాజముద్రకు ముఖ్యమంత్రి జగన్ గారు ఇస్తున్న ప్రాముఖ్యత చరిత్రలో నిలిచి పోతుంది. ‘సత్యమేవ జయతే’. ఇది ప్రజాస్వామ్య, ప్రజాప్రభుత్వం, ఆంధ్రప్రజల శాశ్వత ప్రభుత్వం’ అని వైసీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘అమరావతి బౌద్ధ ధర్మ చక్రం ముందు కూర్చొనే అర్హత నీకు లేదని అందరూ అనుకొనేది నిజం చేశావు జగన్ మోహన్ రెడ్డి. ఇంకా ఊడబెరకాల్సింది నీ కుర్చీనే’ అని టీడీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్.. కామెంట్ల వర్షం కురుస్తోంది.

More News

షాకింగ్..: ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో 50 కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదవ్వడం షాకింగ్ గురి చేస్తోంది.

కంగనా రనౌత్ సోదరికి షాకిచ్చిన ట్విట్టర్!

అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్‌ను యాజమాన్యం నిలిపివేసింది.

రామ్‌ చరణ్‌తో ఫన్నీగా మాట్లాడిన కేటీఆర్..!

అవునా ఇదేంటి.. ఈ ఇద్దరి మధ్య ఏం టాఫిక్ వచ్చిందబ్బా..? అని అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే.. కానీ ఇక్కడ సినిమాలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదండోయ్..

బోయ‌పాటి వెన‌క‌డుగు..!!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

సూర్య కమిట్‌మెంటే వేర‌ప్పా!!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.