విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు
Send us your feedback to audioarticles@vaarta.com
'శివపుత్రుడు', 'అపరిచితుడు' వంటి తమిళ అనువాదాలతో తెలుగులోనూ మార్కెట్‌ని పొందాడు విక్రమ్. పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ.. స్ట్రయిట్ చిత్రాల కంటే అనువాదాల చిత్రాలతోనే విక్రమ్‌కి ఇక్కడ గుర్తింపు దక్కింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో వచ్చిన 'ఐ', '10 ఎండ్రత్తుకుల్ల' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో విక్రమ్ తన తదుపరి చిత్రంపై బాగా ఫోకస్ పెట్టాడు.
అయితే.. ఊహించని రీతిలో ఈ సినిమాకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదటగా నిర్మాతలు మారారు. తరువాత హీరోయిన్లు మారారు. ఇప్పుడేమో టైటిలే మారబోతోంది. 'మర్మ మణిదన్' పేరుతో వార్తల్లోకి వచ్చిన ఈ సినిమా .. ఇప్పుడు 'మారీశన్' పేరుతో తెరకెక్కనుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్రమ్ చేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్ర.. రామాయణంలోని మారీచుడు పాత్రని పోలి ఉండే పాత్ర అని.. అందుకే చిత్ర యూనిట్ ఈ టైటిల్ ని కూడా ఆలోచిస్తుందని సమాచారం. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్నో మార్పులకు గురవుతున్న ఈ సినిమా.. ఫలితం పరంగా విక్రమ్‌కి కలిసిరావాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments