టీటీడీలో కొత్తదనం.. 25 మందితో పాలకమండలి

  • IndiaGlitz, [Wednesday,August 28 2019]

ఏపీలో కొత్త సర్కార్‌ వచ్చిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుధీర్ఘ చర్చ తర్వాత టీటీడీ పాలకమండలి సభ్యులను ప్రకటించడం జరిగింది. కాగా.. ఇదివరకు 19కు పరిమితమైన పాలకమండలి సభ్యులను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా.. జగన్ సర్కార్ మాత్రం మరో ఆరుగుర్ని పెంచి 25 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు.

పాలకమండలి సభ్యులు వీరే..

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్
మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు
మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి
సుబ్బారావు, కృష్ణ మూర్తిలను నియమిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

More News

ఆ రెండు నెలల్లో పాక్-భారత్ మధ్య యుద్ధం..!

ప్రత్యర్థి, దాయాది దేశమైన పాకిస్థాన్.. భారత్‌పై అస్తమానూ కాలు దువ్వుతూనే ఉంది. ఆర్టికల్-370 రద్దుతో మరింత జోరు పెంచిన పాక్..

మనసు చంపుకుని మరీ సినిమాల్లో చేస్తున్నా!!

టాలీవుడ్ సీనియర్ నటి ‘సుధ’ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తల్లి మొదలుకుని అక్క, వదిన, అత్తమ్మ ఇలా ఎన్నో పాత్రల్లో

‘కోల్‌కతా లతా మంగేష్కర్’కు సల్లు భాయ్ కల్లుచెదిరే గిఫ్ట్!

మొన్నామధ్య రాజమండ్రి పరిసరాల్లోని పల్లెకోకిల పసల బేబీ ఉదంతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది..

ప్రజలు తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా!?

పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని.. వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై  ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు.

'రాయలసీమ లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం