టీటీడీలో కొత్తదనం.. 25 మందితో పాలకమండలి
- IndiaGlitz, [Wednesday,August 28 2019]
ఏపీలో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుధీర్ఘ చర్చ తర్వాత టీటీడీ పాలకమండలి సభ్యులను ప్రకటించడం జరిగింది. కాగా.. ఇదివరకు 19కు పరిమితమైన పాలకమండలి సభ్యులను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా.. జగన్ సర్కార్ మాత్రం మరో ఆరుగుర్ని పెంచి 25 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు.
పాలకమండలి సభ్యులు వీరే..
యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్
మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు
మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి
సుబ్బారావు, కృష్ణ మూర్తిలను నియమిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.