పవన్ స్క్రిప్ట్ లో చేంజస్...

  • IndiaGlitz, [Wednesday,December 21 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా కాట‌మ‌రాయుడు చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ రెండు సినిమాలు చేయ‌నున్నాడు. అందులో ఒక‌టి ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం చేయ‌బోయే సినిమా కాగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిన‌బాబు నిర్మించ‌నున్న సినిమా. ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా వేదాళం రీమేక్‌ను తెలుగులో ఆర్‌.టి.నేస‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. సినిమాను త‌మిళంలో ఉన్న‌ట్టే కాకుండా మెయిన్‌గా రెండు చేంజ‌స్ చేశాడ‌ట‌. అందులో ఒక‌టి ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే బోట్ ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్‌ను చేంజ‌స్ చేశార‌ట‌. అన్నా చెల్లెలు మ‌ధ్య అనుబంధం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి.