మహేశ్ సినిమాలో మార్పు..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానేలేదు కానీ... అప్పుడే ఓ మార్పు జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ సినిమాలో జరిగిన మార్పేంటి అనే వివరాల్లోకెళ్తే.. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో 40 శాతం చిత్రీకరణను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందులో విలన్ ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్కడ నుండి విలన్‌ను ఇండియా రప్పించి ప్రతి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మహేశ్ చూస్తాడు. కథానుగుణంగా కీలక షెడ్యూల్‌ను ముందుగా అమెరికాలో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే మధ్యలో కరోనా వైరస్ ప్రబలడంతో అమెరికా ప్లాన్‌ను పక్కన పెట్టేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సర్కారువారి పాట యు.ఎస్‌కు షూటింగ్‌కు వెళ్లడానికి సిద్ధమైంది. ఇప్పటికే డైరెక్టర్ అండ్ టీమ్ లొకేషన్స్ వేటను కూడా పూర్తి చేసేసింది.
ముందుగా ఈ సినిమాకు పి.ఎస్.వినోద్‌ను సినిమాటోగ్రాఫర్‌గా అనుకున్నారు. అయితే ఆయన పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు. రెండు వేర్వేరే టైమ్స్ జరగాల్సిన షూటింగ్స్ కోవిడ్ పుణ్యమాని ఒకే సమయంలో పడ్డాయి. దీంతో పి.ఎస్.వినోద్ చేసేదేమీలేక ఆల్‌రెడీ కమిట్ అయిన సినిమాకే ఓటేశాడు. దీంతో ‘సర్కారువారి పాట’ సినిమా నుండి తప్పుకున్నాడట. ఇప్పుడు వినోద్ స్థానంలో మది సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టనున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments