చిరు సూచనతో ‘ఆచార్య’లో మార్పులు, చేర్పులు..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. అంతేకాదు.. బహుశా ఆయా రంగాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో.. అసలు కోలుకుంటాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. వీటిలో ముఖ్యంగా సినీ రంగం.. నిజంగా ఇలాంటి విపత్తు ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు.. ఇకపై కూడా రాదేమో. కానీ వైరస్ దెబ్బకు మాత్రం ఒకట్రెండేళ్లు కోలుకొని దెబ్బ పడింది. కొన్ని కోట్ల రూపాయిలు ఇండస్ట్రీ కోల్పోయింది. ఈ మహమ్మారే లేకుంటే ఈ పాటికే ఎన్ని సినిమాలు రిలీజయ్యేవో.. ఎన్నెన్ని షూటింగ్స్ ప్రారంభమయ్యేవో.. కానీ కరోనా దెబ్బతో సర్వం బంద్ అయ్యాయి.
ఇలాంటి తరుణంలో.. భారీ బడ్జెట్ మొదలుకుని సాదా సీదా సినిమాల వరకూ నిర్మాతలు బడ్జెట్ తక్కువగా పెట్టాలని యోచిస్తున్నారట. ఎందుకంటే అసలు ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయో రావో..? ఒకవేవస్తే ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అంతేకాదు సినీ పెద్దలు కూడా చర్చించుకుని బడ్జెట్ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారని టాక్ నడుస్తోంది. ఇది కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన.. ప్రారంభం కాబోయే సినిమాలన్నీంటికీ బడ్జెట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకనిర్మాతలు ఓ మాట అనేసుకున్నారట.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ విషయంలో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారట. వాస్తవానికి ఇప్పటికే సగం షూటింగ్ అయిపోయింది.. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే సినిమా షూట్ పూర్తయ్యేది కానీ.. కరోనా దెబ్బతో అందరి కంటే ముందుగా సినిమా షూటింగ్ వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదివరకే అనుకున్న బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో సినిమాను ముగించాలని .. ఎవరికీ నష్టం, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచించారట. అంతేకాదు.. షూటింగ్ కూడా వీలైనంత తక్కువ రోజుల్లోనే ముగించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని కొరటాలకు చెప్పారట. చిరు ఆదేశాల మేరకు.. కొరటాల షెడ్యూల్తో పాటు.. కథలో మార్పు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఇందులో ఏ మేరకు నిజానిజాలున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout