చిరు సూచనతో ‘ఆచార్య’లో మార్పులు, చేర్పులు..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే పలు రంగాలు ఈ వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. అంతేకాదు.. బహుశా ఆయా రంగాలు కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో.. అసలు కోలుకుంటాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. వీటిలో ముఖ్యంగా సినీ రంగం.. నిజంగా ఇలాంటి విపత్తు ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు.. ఇకపై కూడా రాదేమో. కానీ వైరస్ దెబ్బకు మాత్రం ఒకట్రెండేళ్లు కోలుకొని దెబ్బ పడింది. కొన్ని కోట్ల రూపాయిలు ఇండస్ట్రీ కోల్పోయింది. ఈ మహమ్మారే లేకుంటే ఈ పాటికే ఎన్ని సినిమాలు రిలీజయ్యేవో.. ఎన్నెన్ని షూటింగ్స్ ప్రారంభమయ్యేవో.. కానీ కరోనా దెబ్బతో సర్వం బంద్ అయ్యాయి.

ఇలాంటి తరుణంలో.. భారీ బడ్జెట్ మొదలుకుని సాదా సీదా సినిమాల వరకూ నిర్మాతలు బడ్జెట్ తక్కువగా పెట్టాలని యోచిస్తున్నారట. ఎందుకంటే అసలు ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయో రావో..? ఒకవేవస్తే ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అంతేకాదు సినీ పెద్దలు కూడా చర్చించుకుని బడ్జెట్ విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారని టాక్ నడుస్తోంది. ఇది కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన.. ప్రారంభం కాబోయే సినిమాలన్నీంటికీ బడ్జెట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకనిర్మాతలు ఓ మాట అనేసుకున్నారట.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ విషయంలో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారట. వాస్తవానికి ఇప్పటికే సగం షూటింగ్ అయిపోయింది.. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే సినిమా షూట్ పూర్తయ్యేది కానీ.. కరోనా దెబ్బతో అందరి కంటే ముందుగా సినిమా షూటింగ్ వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదివరకే అనుకున్న బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్‌లో సినిమాను ముగించాలని .. ఎవరికీ నష్టం, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచించారట. అంతేకాదు.. షూటింగ్‌ కూడా వీలైనంత తక్కువ రోజుల్లోనే ముగించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని కొరటాలకు చెప్పారట. చిరు ఆదేశాల మేరకు.. కొరటాల షెడ్యూల్‌తో పాటు.. కథలో మార్పు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఇందులో ఏ మేరకు నిజానిజాలున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

More News

బాలయ్య బర్త్ డేపై బ్రాహ్మణి ఎమోషనల్ మెసేజ్..

టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న పుట్టిన రోజు. ఈ పదో తారీఖుతో బాలయ్య 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

కరోనా దయవల్ల హ్యాపీగా ఉన్నా..: ఆర్జీవీ

ఇదేంటి టైటిల్ చూడగానే.. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. లోకమంతా భయంతో వణికిపోతుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఉండటమేంటి..?

తెలంగాణలో ‘పది’ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక..

బాలయ్యతో విబేధాల్లేవ్.. నాకు ప్రత్యేక గౌరవం : నాగబాబు

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే.

తెలుగు ద‌ర్శ‌కుల కోసం మ‌ణిర‌త్నం..!

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘పొన్నియ‌న్‌సెల్వ‌న్’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని ఆయ‌న రూపొందిస్తున్నారు.