రిలీజ్ డేట్ మార్చ‌మంటున్న సూప‌ర్ స్టార్

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే హీరోయిన్ గా న‌టిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న క‌బాలి చివ‌రి షెడ్యూల్ ప్ర‌స్తుతం మ‌లేషియాలో జ‌రుగుతుంది. ఈ నెల 20కి షూటింగ్ పూర్త‌వుతుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త‌మిళ న్యూయ‌ర్ రోజైన ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తుండ‌డంతో ఎన్నిక‌ల తేదీ విడుద‌ల‌య్యాకా...సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందో ఆలోచించ‌మ‌ని నిర్మాత క‌లైఫులి ధానుకి ర‌జ‌నీకాంత్ చెప్పార‌ట‌. అందుచేత క‌బాలి ముందు అనుకున్న విధంగా ఏప్రిల్ 14న రిలీజ్ కావ‌డం లేద‌ట‌. ఎన్నిక‌ల డేట్ ను బ‌ట్టి ఏప్రిల్ నెలాఖ‌రున కానీ..మే లో కానీ క‌బాలి రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.