వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లకు TG ప్రిఫిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఉన్న TS స్థానంలో ఇప్పుడు TG మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇక నుంచి అధికారికంగా TG అని ఉండనుంది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం మంత్రివర్గ సమావేశంలో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో టీఎస్ పేరు టీజీగా మార్పు చేయాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం అయిన TG ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే వాహనదారులు ప్రస్తుతం ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన పనిలేదని రవాణాశాఖ అధికారులు స్పష్టంచేశారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే TG నంబర్ ప్లేట్ ఉండనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పాత వాహనాలకు నెంబర్ ప్లేట్‌ను AP నుంచి TSగా మార్చలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. విభజన అనంతరం AP నంబర్ ప్లేట్స్‌నే 30 లక్షల వాహనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కాగా తెలంగాణలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకూ TS పేరిట రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇక నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల నెంబర్ ప్లేట్లపై TGగా మారనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments