ఏపీలో మార్పు మొద‌లైంది.. అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది!

  • IndiaGlitz, [Sunday,May 12 2019]

‘సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత ఏంటి అనే సంగ‌తి ప‌క్కన‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు’ అని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జ‌న‌సేన బ‌లం తెలియ‌దన్న ప‌దం ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్దని, కొన్ని ల‌క్షల మంది యువ‌త వెంట ఉన్నార‌ని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా, మందీ మార్బలం లేకుండా.. ఇంతమంది ఎన్ని కోట్లు ఇస్తే వ‌స్తార‌ని ప్రశ్నించారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో పార్టీ త‌రఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల‌తో పవన్ సమావేశం నిర్వహించారు.

నేను అలాంటి రాజ‌కీయాలు చేయ‌ను!

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్థాపించి కాంగ్రెస్‌లో కలిపేసిన ‘ప్రజారాజ్యం’ పార్టీ ప్రస్తావన వచ్చింది. పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం ఎలా ఉంటుందనే భ‌యం లేదు. ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్టలేదు. ఎంత పోరాటం చేశామ‌న్న అంశం మీదే నా ఆలోచ‌న‌. మార్పు కోసం మ‌హిళ‌లు చాలా బ‌లంగా నిల‌బ‌డ్డారు. గెలుస్తారా.? లేదా.? అన్న అంశం ప‌క్కన‌పెట్టి భ‌య‌ప‌డ‌కుండా వ‌చ్చి ఓట్లు వేశారు. పొలిటిక‌ల్ ప్రాసెస్‌లో స‌హ‌నం, ఓపిక అవ‌స‌రం. గుండె ధైర్యం కావాలి. అంతా క‌న్వెన్షన‌ల్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజ‌కీయాలు చేయ‌ను. డ‌బ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఓట‌మి లోతుల నుంచి బ‌య‌టకు వ‌చ్చాను. నాకు నిగ్రహం-నియ‌మం ఉన్నాయి అని పవన్ చెప్పుకొచ్చారు.

నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి..!

ఎన్నో అవ‌మానాలు, వెట‌కారాలు భ‌రించాను. 2014లో జ‌న‌సేన పార్టీ స్థాపించే స‌మ‌యంలో ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న ఆలోచ‌న చేయ‌లేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి అని మాత్రమే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి ప‌దాల‌కు తావులేదు. అంతా పార్టీ నిర్మాణం జ‌ర‌గాలి అని స‌ల‌హాలు ఇస్తున్నారు. అది అంత తేలిక ప్రక్రియ కాదు. అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్రట‌రీ, వారికి అది అని ఇచ్చే ప‌ద‌వులు ఇవ్వడం కాదు పార్టీ నిర్మాణం అంటే. కొత్తతరాన్ని త‌యారు చేస్తున్నాం. అంతా ఓ భావ‌జాల‌నికి అల‌వాటు ప‌డాలి. నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్నాం. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు లీడ‌ర్స్ లేరు. జ‌న‌సైనికులు మాత్రమే ఉన్నారు. అదే జ‌న‌సైనికులు కొన్ని ల‌క్షల మంది యువ‌త రూపంలో మీ వెంట ఉన్నారు. అంతా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే యువ‌త‌. వారికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్ప ఎవ‌రూ తెలియ‌దు. ఎవ‌రి మాట విన‌రు. ఇదంతా ముడి స‌రుకు. దాన్ని శుద్ధి చేయాలి, సాన‌బ‌ట్టాలి. అందుకు నిబ‌ద్దత అవ‌స‌రం అని నేతలకు జనసేనాని సూచించారు.

More News

గాజువాకలో గెలుపెవరిదో తేల్చేసిన పృథ్వీ..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని అధినేతలు వేచి చూస్తున్నారు.

పాటల మినహా పూర్తయిన 'అమ్మ దీవెన'

అమ్మతోనే పుట్టుక ప్రారంభం, అమ్మనే సృష్టికి మూలం,అమ్మ లేని లోకం చీకటిమయం అవుతుందంటూ మాతృమూర్తి పై

మదర్స్‌ డే నాడు నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. ట్రోలింగ్!

కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో.. సంరక్షణలో సురక్షితంగా ఉంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

'మ‌హ‌ర్షి' 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` రీసెంట్‌గా విడుద‌లైంది. గురు, శుక్ర‌, శని వారాల‌కు.. అంటే సినిమా మూడు రోజుల‌కు రూ.40.59కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది.

బోయ‌పాటి టైటిల్‌తో బాల‌య్య‌

నందమూరి బాల‌కృష్ణ 105వ సినిమాకు సంబంధించిన వేగంగా జ‌రుగుతున్నాయి. జైసింహా త‌ర్వాత కె.ఎస్‌.ర‌వికుమార్ డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది.