అనుష్క క్యారెక్ట‌ర్ మార్చ‌మంటున్న ఫ్యాన్స్..

  • IndiaGlitz, [Friday,January 08 2016]

అందాల తార అనుష్క‌...సూర్య న‌టిస్తున్న సింగం 3 లో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. సింగం, సింగం 2 చిత్రాల‌కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ముందుగా సింగం 3 టైటిల్ అనుకున్న‌ప్ప‌టికీ...ఆత‌ర్వాత ఎస్ 3 అనే న్యూ టైటిల్ పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అనుష్క సూర్య భార్య పాత్ర పోషిస్తుంద‌ట‌. సింగం, సింగం 2 చిత్రాల్లో సూర్య ప్రియురాలి పాత్ర పోషించిన అనుష్క ఎస్ 3 లో భార్య పాత్ర పోషిస్తుంద‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ విష‌యం తెలుసుకున్న అనుష్క ఫ్యాన్స్... భార్య పాత్ర అంటే రొమాంటిక్ సీన్స్ కి స్కోప్ త‌క్కువ ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో అనుష్క పాత్ర‌లో మార్పులు చేయాలని..రొమాంటిక్ సీన్స్ ఎక్కువుగా ఉండాల‌ని సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ ద్వారా డైరెక్ట‌ర్ హ‌రిని డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఈ నెల 12 నుంచి అనుష్క ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. మ‌రి..అనుష్క క్యారెక్ట‌ర్ లో డైరెక్ట‌ర్ హ‌రి మార్పులు చేస్తాడో..? లేదో..చూడాలి.