చంద్రిక మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,September 25 2015]

హార‌ర్ సినిమాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కుతున్న స‌మ‌య‌మిది. కాంచ‌న సీరీస్‌, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ వంటి సినిమాల‌న్నీ హిట్ అయిన నేప‌థ్యంలో ఈ మ‌ధ్య త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు వ‌స్తున్నాయి. ఆ కోవ‌లో క‌న్న‌డ‌, తెలుగులో రూపొందిన సినిమా చంద్రిక‌. కామ్న‌జెఠ్మ‌లాని టైటిల్ పాత్ర‌లో న‌టించిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంది? నిజంగా భ‌య‌పెట్టిందా? లేదా చూద్దాం.

క‌థ‌

అర్జున్ (కార్తీక్ జ‌య‌రామ్‌) ఆర్టిస్ట్. త‌న చిత్ర‌లేఖ‌న‌ల‌ను డ‌బ్బులు చేసుకోవ‌డానికి కాకుండా కేవ‌లం ఆత్మ‌సంతృప్తి కోసం అమ్ముకుంటుంటాడు. ఆయ‌న భార్య శిల్ప (శ్రీముఖి). శిల్ప గృహిణి. త‌న భార్య‌కు పుట్టిన‌రోజు కానుక‌గా ఓ హ‌వేలిని కొనిస్తాడు అర్జున్‌. అందులో కాపురం పెట్టిన త‌ర్వాత అత‌ని జీవితంలోకి అనుకోని స‌మ‌స్య‌లు రాసాగుతాయి. ఇంత‌కీ అత‌ను కొన్న ఆ ఇంటి వ‌ల్ల ఏం జ‌రిగింది? ఆ ఇంట్లో ఏం ఉంది? చ‌ంద్రిక ఎవ‌రు? చ‌ంద్రిక‌కు అర్జున్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఈ ప్ర‌శ్న‌ల‌తో సెకండాఫ్ సాగుతుంది.

ప్ల‌స్ పాయింట్లు

ఈ సినిమాకు కె.రాజేంద్ర‌బాబు కెమెరా, గుణ్వంత్ సేన్ రీరికార్డింగ్ ప్ల‌స్ పాయింట్లు. శ్రీముఖి త‌న పాత్ర‌లో వేరియేష‌న్ బాగా చూపించింది. హీరో మేన్లీగా ఉన్నాడు. త‌న పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు. గిరీష్ క‌ర్నాడ్ య‌థావిధిగా చ‌క్క‌గా న‌టించారు. ఎల్బీ శ్రీరామ్‌ను ఈ సినిమాలో వాడుకోలేదు. స‌త్యం రాజేష్ త‌న‌కిచ్చిన పాత్ర‌లో బాగా చేశాడు. ఆర్ట్ వ‌ర్క్ బావుంది. రిచ్‌గా సినిమాను తీయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.

మైన‌స్‌

స్ట్రాంగ్ పాయింట్ లేదు. క‌థ అల్లుకున్న విధానాన్ని గ‌మ‌నిస్తే చంద్ర‌ముఖి సినిమా అట్టే క‌ళ్ళ ముందు క‌దులుతుంది. పాట‌లు అస‌లు బాగోలేవు. పాట‌ల‌ను బాగా తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ లిరిక్స్ వింటుంటే న‌వ్వొస్తుంది. ఎక్క‌డా మ‌న తెలుగు పాట‌ల‌ను వింటున్న‌ట్టు ఉండ‌దు. కామ్న జ‌ఠ్మ‌లాని అందంగా క‌నిపించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం న‌ట‌న‌లో చేయ‌లేదు. న‌డిరేయికి రాజ‌త‌డు.. అనే ప‌దాలు ఎందుకొస్తాయో తెలియ‌దు. ఆ పాట‌ను పాడిన గొంతు విన‌డానికి బాగోలేదు. శ్రీముఖిలో దెయ్యాన్ని చూపించే స‌న్నివేశాలు కూడా ఇంపాక్ట్ ని క‌లిగించ‌వు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ లో నందిత‌ను చూసిన‌ట్టే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. ఇలాంటి సినిమాలు మల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుంటాయి. తెలుగులో క‌ష్ట‌మే.

విశ్లేష‌ణ‌

చంద్ర‌ముఖిని చూసిన వారు ఈ సినిమాను చూడ‌క్క‌ర్లేదు. చంద్ర‌ముఖి సినిమాను చూసి ఎక్క‌డా మేం ఆ సినిమా ఛాయ‌లు లేకుండా ఈ సినిమాను జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించాం అని ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీముఖి చెప్పిన మాట‌ల‌ను న‌మ్మ‌కూడ‌దు. ఎదురుగా ఉన్న చంద్రిక ఫోటో, చంద్రిక ముందు నిలుచుని చంద్రిక‌లా శిల్ప మార‌డం, క్లైమాక్స్ స‌న్నివేశంలో చంద్రిక చ‌నిపోవ‌డానికి ముందు ఆగిన పెళ్ళిని మ‌ర‌లా కంటిన్యూ చేయ‌డం... ఇలాంటివ‌న్నీ అడుగ‌డుగునా చంద్ర‌ముఖిని త‌ల‌పిస్తాయి. కాక‌పోతే ఆ చిత్రంలో ప్ర‌భు స్నేహితుడుగా ర‌జ‌నీకాంత్ ఆ స‌మ‌స్య‌ను పోగొడితే, ఇక్క‌డ హీరో స్నేహితుడిగా స‌త్యం రాజేష్ పారిపోతాడు. అంతే తేడా. ఎక్క‌డా కామెడీ లేదు. ఇంటిమ‌సీ సీన్స్ మాత్రం హీరోకి ఇద్ద‌రు హీరోయిన్ల‌తోనూ క‌నిపిస్తాయి. లిప్ లాక్ అన‌వ‌స‌రం. అవ‌న్నీ క‌మ‌ర్షియాలిటీని కొని తెచ్చిపెట్ట‌వ‌న్న‌ది నిజం.

బాట‌మ్ లైన్‌: చం‌ద్రిక కేరాఫ్ చంద్ర‌ముఖి

రేటింగ్‌: 2.5/5

English Version Review

More News

బన్ని మొగ్గుతున్నరా?

బన్ని ప్రస్తుతం సరైనోడు సినిమాలో నటిస్తున్నారు.

తేజుకు మెగా అభినంద‌న‌

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే స‌క్సెస్ టాక్ సొంతం చేసుకుంది.

డిక్టేట‌ర్ ఏం చేస్తున్నాడు..?

నందమూరి న‌ట సింహా్ం బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహ‌న్ న‌టిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఎఫైర్'

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్".

శ్రీమంతుడు అర్థ‌శ‌త దినోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం శ్రీమంతుడు. ఊరును ద‌త్త‌త తీసుకోవ‌డం అనే కాన్సెప్ట్ తో వ‌చ్చిన శ్రీమంతుడు చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.