'చంద్రిక' సెన్సార్ పూర్తి!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై.. యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్‌టైనర్ చంద్రిక`. కార్తీక్ జయరామ్-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ... మా దర్శకుడు యోగేష్ చంద్రిక` చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టు అభినయం, మా మ్యూజిక్ డైరెక్టర్ గున్వంత్‌సేన్ రీరికార్డింగ్‌తోపాటు గ్రాఫిక్స్ చంద్రిక` చిత్రానికి ప్రధాన ఆకర్షణుగా నిలుస్తాయి` అన్నారు.
దర్శకుడు యోగేష్ మాట్లాడుతూ... మా నిర్మాత ఆశ మేడమ్ మరియు ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్లే చంద్రిక` చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొనేలా రూపొందింది` అన్నారు.
గిరీష్ కర్నాడ్, ఎల్.బి.శ్రీరాం, సత్యం రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com