Chandrayaan-3:చరిత్ర సృష్టించిన ఇస్రో .. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్, జయహో భారత్ అంటోన్న ప్రపంచం
Send us your feedback to audioarticles@vaarta.com
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకే క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండర్‌ను దించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా ఇండియా రికార్డుల్లోకెక్కింది. బుధవారం సాయంత్రం చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ప్రారంభించింది. అనంతరం నాలుగు దశల్లో విక్రమ్ ల్యాండర్ ప్రక్రియను ముగించి 6.04 గంటలకు చంద్రుడిని ముద్దాడింది.
తొలుత ఇస్రో శాస్త్రవేత్తలు.. ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) కమాండ్‌ను పంపారు. దీనిని అందుకున్న ల్యాండర్ మాడ్యూల్.. ఏఐ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించింది. తన నాలుగు థ్రాటల్‌బుల్ ఇంజిన్లను ప్రజ్వలించిన తన స్పీడ్‌ను తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్‌పీడీసీ) , కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టీమీటర్ వంటి సాధనాలతో డెస్టినేషన్ చేరింది.
చంద్రయాన్ 3 ప్రయోగం సక్షెస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. దక్షిణాఫ్రికా నుంచి ల్యాండింగ్ ప్రక్రియను వర్చువల్‌గా వీక్షించిన ఆయన ప్రయోగం ముగిసిన వెంటనే ఇస్రో ఛైర్మన్ సోమనాధ్‌కు ఫోన్ చేసి అభినందించారు. అలాగే పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ప్రముఖులు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ వ్యయం రూ.613 కోట్లు :
చంద్రయాన్ 3 బరువు 3,900 కిలోలు... ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,148 కిలోలు.. ల్యాండర్, రోవర్ 1752 కిలోలు.. ప్రాజెక్ట్ వ్యయం రూ.613 కోట్లు.. ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వ్యాసం 4 మీటర్లు.. లిఫ్టాఫ్ బరువు 640 టన్నులు. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగాక విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. అక్కడ 14 రోజుల పాటు వుండి జాబిల్లిపై పలు అధ్యయనాలు చేస్తుంది. ఎందుకంటే చంద్రుడిపై సూర్యరశ్మి వున్నంతసేపే విక్రమ్, ప్రగ్యాన్‌లోని వ్యవస్ధలు సక్రమంగా పనిచేస్తాయి. ఒక్కసారి సూర్యాస్తమయం అయ్యిందంటే చంద్రుడిపై మొత్తం అంధకారంగా మారుతుంది ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments